Saturday, August 8, 2009
useful sites
I have found some Telugu blogs and related websites which may be useful for telugu speaking people. The list of blogs and websites is given below:
Chaduvari.blogspot.com
charasala.com/blog
apmedia.blogspot.com
desipundit.com/category/telugu
groups.google.com/group/telugublog
Telugu Music
Hyderabad bachelors
Telugu typing
Maramaraalu
Technology in Telugu
Onamaalu
Snehama
Telugu Cinema
Telugu Bloggers
TeluguTanam
Telugu Video
Telugu Wiki paedia
Telugu Dukaanam
Telugu Station
Telugu Maata - Tene Poolu
Sri Venkat Cine reviews
Technical site in Telugu
Journalism blogs in Telugu
apmedia.blogspot.com
apmediatruth.blogspt.com
telugumedia.news.blogspot.com
Jokes Blog in Telugu
Telugu Jokes blog
List of directories which give links to different telugu blogs
Koodali
Avee Ivee
Jalleda
telugu sites
సాహిత్యం
ఈ జాబితాలో తెలుగు సాహిత్యానికి సంబందించిన సైట్లు వ్రాస్తున్నాను.
- సాహితి
- తెలుగు వన్
- తెలుగు వెబ్ సైట్
- తెలుగు కార్టూన్లు
- సిరిగిన
- మాక్స్ పేజెస్-తెలుగు
- తెలుగు వరల్డ్
- శైలు
- తెలుగు సాహిత్యంగల ఒక వ్యక్తిగత పేజి
- ఈ-వారం
- మాగంటి.ఆర్గ్
చలన చిత్రాలు
ఈ జాబితా లోని సైట్లలో చలన చిత్రాలను గురించిన వార్తలు, పాటలు, ట్రయిలర్స్ మొదలైనవి లభించును.
- తెలుగు వన్
- ఐడిల్ బ్రైన్
- గ్రేట్ ఆంధ్ర
- సంతోషం
- తెలుగు సినిమా
- నాన్ స్టాప్ సినిమా
- ఫిల్మ్ చాంబర్
- ఆంధ్ర విలాస్
- టూటల్ టాలీవుడ్
- బుల్లి తెర
- రమణీయ
- రాగలహరి
- మన తెలుగు
- తెలుగు తోరణం
- తెలుగు స్టేషన్
- తెలుగు ఎఫ్. ఎమ్
- సీతారాం
- తెలుగు బిజ్
- దీనిలో తెలుగు సినిమా పాటల సాహిత్యం(lyrics) చూడవచ్చు.
- మీరు కోరిన పాటలు
వార్తలు
ఇక్కడ వార్తలను అందించే సైట్ల వివరాలను పొందుపరుస్తాను.
- ఈనాడు
- వార్త
- ఆంధ్రభూమి
- ఆంధ్రప్రభ
- ఆంధ్రజ్యోతి
- ప్రజాశక్తి
- వెబ్ ప్రపంచం
- ఆంధ్ర వాణి
- ఆంధ్ర న్యూస్
- దట్స్ తెలుగు
- రీడిఫ్ తెలుగు
- ఎ.పి. వీక్లీ
Friday, August 7, 2009
pingali venkaiah
™ðlË$VýS$ ©í³¢, {†Ð]lÆý‡~ {ç³©í³¢ í³…VýSã Ððl…MýSĶæ$Å | |
|
Friday, April 24, 2009
బొడ్డెమ్మపండుగ(BODDEMMA FESTIVAL IN TELANGAANA)

తెలంగాణా ప్రాంతంలో పల్లె జానపదానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.తెలంగాణాకే పరిమితమైన రెండు పండుగలు బతుకమ్మ, బొడ్డెమ్మ. ఒకదాని వెంట ఒకటి వరుసగా జరుపుకొనే ఈ రెండు పండుగలు గౌరీ దేవికి సంబంధించినవే.. ఈ రెండింతిలో బతుకమ్మ పెద్దల పండుగైతే.. బొడ్డెమ్మ పిల్లల పండుగ. భాద్రపద బహుళ పంచమి మొదలుకొని మహాలయ అమావాస్య వరకు బొడ్డెమ్మను, మహాలయ అమావాస్య నుంచి ఆశ్వయుజ శుద్ద నవమి వరకు బతుకమ్మను జరుపుకుంటారు. తెలంగాణాలో సాధారణంగా ఈసమయానికి పంటలు చేతికి వస్తాయి. ధాన్యలక్ష్మి కళకళలాడుతుంటే స్త్రీ పురుషులు పిల్లలు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు ఇల్లు వాకిలి శుభ్రం చేసి సున్నం, జాజులతో అలికి ముగ్గులు పెట్టి రాబొయే పండుగలకు సన్నాహాలు చేస్తుంటారు. ఇదే సమ్యంలో పిల్లలు బొడ్డెమ్మను చేసి వాటిపై పూలు పెట్టి చప్పట్లు కొడుతూ ఆటలాడుతారు.
బొడ్డెమ్మకు ఆ పేరెలా వచ్చిందటే:
బొడ్డెమ్మ పేరుకు బొట్టె, బొడిప, బొటిమ, పొట్టి అనే పర్యాయ పదాలున్నాయి. వీటన్నింటికి చిన్న అని అర్థం. బొడ్డెమ్మ అంటే ధాన్య రాశి, ధాన్యపు కుప్ప, అత్తిచెట్టు అని కూడా అర్థం ఉంది. సంతానానికి వివాహానికి ఈ పండుగలో మేడిని పూజిస్తారు.
పూజావిధానం:
బొడ్డెమ్మను చెక్కపీటపై పేరుస్తారు. పుట్టమన్నుతో చతురస్రాకారంగా ఐదు దొంతరలు చేసి వాటిని ఒకదానిపై ఒకటి త్రుభుజాకారంగా పేరుస్తారు. ఉద్రాక్ష, కాకర, కట్ల, బీర, మల్లె, జాజి, మందార పూలతో అలంకరిస్తారు. శిఖర ప్రదేశాన బియ్యంతో నిండిన చిన్న కలశం, దానిపైన కొత్త రవికెలను పెట్టి తమలపాకు లోని పసుపు గౌరమ్మను పూజిస్తారు. చెక్కతోకూడా బొడ్డెమ్మను చేసి దానిపై నాలుగువైపులా నాలుగు మట్టి ముద్దలు పెట్టి పూలతో అలంకరించడం కూడా చేస్తారు. సాయంకాలం ఇంటి ముందర అలికి ముగ్గులు పెట్టి అక్కడ బొడ్డెమ్మను నిలుపుతారు. ఇరుగుపొరుగు బాలికలు , కన్నెపిల్లలంతా వచ్చి చప్పట్లు కొదుతూ పాటలు పాడుతూ చుట్టూ తిరుగుతారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు ఇలా ఆటపాటలతో గడిపి ఆతర్వాత పప్పు బెల్లం నైవేద్యంగా పెడుతారు. తర్వాత బొడ్డెమ్మను పూజా గృహంలో ఉంచి తొమ్మిదో రోజున నిమజ్జనం చేస్తారు.
బొడ్డెమ్మా బొడ్డెమ్మ.. వలలో
బిడ్డాలెందారే ..వలలో
నీ బిడ్డ నిత్యగౌరీ ..వలలో
నిత్యమల్లె చెట్టువేసీ.. వలలో
Wednesday, March 25, 2009
ఉగాది

తెలుగు వాకిట క్రొంగొత్త ధనంతో ఎటు చుసిన సందడి చేసేది ఉగాది
ఎప్పటికప్పుడు కొత్త పేరుతొ వచ్చినా మానవాళికి నవ్యతను సంతరింపచేసే పెన్నిధి
షడ్రుచుల మేళవింపులో జీవన సారాన్ని తెలియజేసే సంబరాల జావళి
పేరులోనే విరోధి ఉన్నా మనిషికి ఎదురయ్యే ఆటంకాలకు విరోధినవుతానంటోంది
కలకాలం కమ్మని సరిజీవనాన్ని కోరుకోమంటూ
జీవన సమరంలో చూపించాలి తెలుగు దనపు గుభాళింపు..
పిడికెడు స్నేహం..
చారెడు సంతోషం..
గుప్పెడు సహనం..
గరిటెడు నిజాయితీ..
కొంచెం హాస్యం..
చిటికెడు కోపం..
కలగలిపినదే జీవన ఉగాది పచ్చడి ..
ఇదే నేపథ్యంలో నూతన ఉగాది విరోధి ..
కావాలి మీ ఇంట స్నేహ పూర్వక సహవాసి..
Monday, March 23, 2009
శ్రీశ్రీ
స్వాతంత్ర్యం, సమభావం - సౌభ్రాత్రం, సౌహార్దం..
పునాదులై ఇళ్లు లేచి - జనావళికి శుభం పూచి
శాంతి, శాంతి,కాంతి , శాంతి
జగమంతా జయిస్తుంది
ఈ స్వప్నం ఫలిస్తుంది "- శ్రీశ్రీ
"మానవుడు తన మంచి చెడ్డలకు తానేబాధ్యుడు. మానవ సంఘానికి తన పరిస్థితి తానూ చక్కదిద్దుకునే శక్తి ఉన్నాసామజిక చైతన్యం లేదు. అటువంటి చైతన్యం అందించడం కవిత్వం చేయాల్సిన పని " అంటూ జనం బాధలను తన బాధగా ప్రకటించిన మహాకవి శ్రీశ్రీ.తన ప్రతీ రచనలో కష్టాలకు క్రుంగిపోకుండా కదం తొక్కుతూ పదం పాడుతూ ముందుకు సాగామన్నాడు. ప్రాణత్యాగానికి సైతం వెనుకాడకుండా దారిపొడుగునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ సాగమని ధైర్యాన్ని నూరిపోసాడు . ప్రభంజనంలోని ఉధృతి, భావంలోని వేగం, నయాగరా జలపాతంలోని చైతన్యంతో ముందుకురకమని మరో ప్రపంచం వైపు మహాప్రస్థానాన్ని సాగించాలని బోధించాడు. పీడితులకు చైతన్యాన్నిచ్చి ముందుకు నడిపించే రచనా వ్యాసంగం శ్రీశ్రీది.
అపారమైన నవ్యుత్పత్తి, అనన్య సామాన్యమైన ప్రజ్ఞ , అనితర సాధ్యమైన సంవిధాన చాతుర్యం, అతులితమైన ఉద్యమ స్పూర్తి, అజేయమైన మానవతా విశ్వాసం .. ఇన్ని లక్షణాలు మూటగట్టుకున్న మన తెలుగు కవి శ్రీరంగం శ్రీనివాసరావు(శ్రీశ్రీ). ఒక శ్రీ కారం అభ్యుదయ ప్రస్తానానికైతే మరో శ్రీ కారం విప్లవ ప్రస్థానానికి ..
1910లో జన్మించిన శ్రీశ్రీ 1933నుంచి 1947వరకు రచించిన 41గీతాలు మహాప్రస్థానం గా అవతరించాయి. 1950జూన్ లో మొదటిసారి ముద్రితమైన ఈ రచన ఇప్పటివరకు 25సార్లు పునర్ముద్రితమైంది.

Subscribe to:
Posts (Atom)