తెలుగు వాకిట క్రొంగొత్త ధనంతో ఎటు చుసిన సందడి చేసేది ఉగాది
ఎప్పటికప్పుడు కొత్త పేరుతొ వచ్చినా మానవాళికి నవ్యతను సంతరింపచేసే పెన్నిధి
షడ్రుచుల మేళవింపులో జీవన సారాన్ని తెలియజేసే సంబరాల జావళి
పేరులోనే విరోధి ఉన్నా మనిషికి ఎదురయ్యే ఆటంకాలకు విరోధినవుతానంటోంది
కలకాలం కమ్మని సరిజీవనాన్ని కోరుకోమంటూ
జీవన సమరంలో చూపించాలి తెలుగు దనపు గుభాళింపు..
పిడికెడు స్నేహం..
చారెడు సంతోషం..
గుప్పెడు సహనం..
గరిటెడు నిజాయితీ..
కొంచెం హాస్యం..
చిటికెడు కోపం..
కలగలిపినదే జీవన ఉగాది పచ్చడి ..
ఇదే నేపథ్యంలో నూతన ఉగాది విరోధి ..
కావాలి మీ ఇంట స్నేహ పూర్వక సహవాసి..
No comments:
Post a Comment