Saturday, November 21, 2009

aaryoktulu

యథావృక్షస్య సంపుష్టితస్య దూరాత్ గంధోవాత్యేవం
పుణ్యస్యకర్మణో దూరాత్ గంధోవాతి!
పుష్పించిన వృక్షం సువాసన ఎలా చాలా దూరం వరకు వ్యాపిస్తుందో, అదే విధంగా పవిత్రమైన కర్మల ప్రభావం చాలాదూరం వరకు వ్యాపిస్తుంది. -వేదవాక్యం
అపిస్వర్ణమయీ లంకా/నమే లక్ష్మణ రోచతే!
జననీ జన్మభూమిశ్చ/స్వర్గాధపి గరీయసీ!
పూర్తిగా బంగారంతో నిండి ఉన్నప్పటికీ ఈ లంకా నగరం ఇంపుగా కనిపించడం లేదు. అమ్మ, మాతృభూమి స్వర్గం కంటే కూడా గొప్పవి. -రామాయణం
యోన్యథా సంతమాత్మానం/అన్యథా ప్రతిపద్యతే!
కింతేన నకృతం పాపం/చోరేణాత్మానుసారిణా!
మానవుడు చేసే ప్రతి పనినీ సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువులు, భూమాత, వరుణుడు, అంతరాత్మ, యముడు, పగలు, ధర్మదేవత మొదలైనవారు గమనిస్తుంటారు. అబద్ధమాడి వారిని వంచించడం ఎవరి తరమూ కాదు. -మహాభారతం
ఉద్ధరేత్ ఆత్మనాత్మానం
న ఆత్మానం అవసాదయేత్
ఆత్మైవ హి ఆత్మనో బంధు
ఆత్మైవ రిపుః ఆత్మనః
మనిషి తనను తాను ఉద్ధరించుకోవాలి. తనను దిగజార్చుకోగూడదు. ఎందుకంటే మనిషి తనకు తానే మిత్రుడు, తనకు తానే శత్రువు. -భగవద్గీత
అసంప్రదాయ విత్ సర్వశాస్త్ర విదపి
మూర్ఖవదుపేక్షణీయః
సకల శాస్త్రములూ తెలిసిన వాడైనా... సంప్రదాయం పాటించని వాడు మూర్ఖుడితో సమానం -ఆది శంకరాచార్య.
దేహోదేవాలయః ప్రోక్తో జీవోదేవః సనాతనః
శిఖరం శిర ఇత్యాహుఃగర్భగేహం గళస్తథా
మంటపం కుక్షిరిత్యాహుః ప్రాకారం జానుజంఘకం
గోపురం పాద ఇత్యాహుః ధ్వజో జీవిత ముచ్యతే!
దేహమే దేవాలయం. అందులోని జీవుడే దేవుడు. శిఖరం శిరస్సు. గర్భగుడి మెడ. మంటపం ఉదరం. ప్రాకార కుడ్యాలు కాళ్లు. రాజ గోపరం పాదాలు. ధ్వజ స్తంభం జీవితం. -ఆర్యోక్తి
భారతీయులనెవరూ విధ్వంసం చేయలేరు. వారు మృత్యుంజయులు. ఆత్మ తత్వాన్నే ఆదర్శంగా చేసుకుని, ఆధ్యత్మికతను విడువనంతకాలం వరకు వారు అమరులై వెలుగొందుతారు. భారతీయతలోనే అన్ని శక్తులూ ఇమిడి ఉన్నాయి. అయితే భారతీయులు తమ చేతుల్ని తమ కళ్లకు అడ్డుపెట్టుకున్నారు. తాము చీకట్లో ఉన్నామని భ్రమపడుతున్నారు.-వివేకానందస్వామి.
మనం తూర్పున ఉన్నాం. పశ్చిమం వైపు చూస్తున్నాం. సూర్యుడు మన వద్దే, మన వెనకే ఉదయిస్తున్నాడు. కానీ దాన్ని మనం గమనించడం లేదు. పాశ్చాత్యులు చూపిస్తున్న అద్దంలో కనిపించే సూర్యుడిని చూసి అక్కడే ఉదయిస్తున్నాడని భ్రమపడుతున్నాం. -సామవేదం

No comments:

Post a Comment